కోటీ మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ
- December 24, 2020
సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయిని చేరుకున్నారు.ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు విజయ్ ఒక్కడే కావడం విశేషం. ఈ అరుదైన రికార్డును ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’’ అనే ట్యాగ్ తో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తన డిఫరెంట్ అటిట్యూడ్,స్టైల్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో క్రియేటివ్ గా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.అందుకే ఇంతమంది విజయ్ కు ఫిదా అయ్యారు.తను ఓ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లైకులు ,కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తారు.విజయ్ కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న రౌడీ స్టార్ ఆ తర్వాత శివ నిర్వాణ,సుకుమార్ డైరెక్షన్లలో సినిమాలు చేయనున్నాడు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







