వ్యవసాయ చట్టాలను రద్దుచేసే దాకా ఉద్యమం ఆగదు:రాహుల్ గాంధీ
- December 24, 2020
న్యూ ఢిల్లీ:కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన ఉద్రిక్తంగా మారింది. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు భావించారు. దీనికోసం పెద్ద ఎత్తున కీలక కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అయితే ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతివ్వలేదు. ముగ్గురికి మాత్రమే రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలో మరోసారి సమావేశమయ్యారు. పోలీసులు అనుమతివ్వనప్పటికీ కాంగ్రెస్ నేతలు ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు ర్యాలీ ప్రారంభించగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ర్యాలీ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి 2 కోట్ల మంది రైతుల సంతకాలు, మెమోరాండం సమర్పిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష