టర్కీలో బయటపడ్డ 99 టన్నుల బంగారం నిధి...
- December 25, 2020_1608888064.jpg)
టర్కీ:ప్రపంచంలో విలువైన మూలకాల్లో బంగారం కూడా ఒకటిగా మారింది.దీంతో బంగారం నిక్షేపాల కోసం అన్ని దేశాలు నిత్యం పరిశోధన చేస్తూనే ఉన్నాయి. అయితే, టర్కీలో బంగారం నిక్షేపాల నిధి బయటపడింది.ఈ నిధిలో 99 టన్నుల బంగారం విలువ 6 బిలియన్ డాలర్లు(రూ.44,139 కోట్లు) ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు.టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో నిధిని కనుగొన్నారు.వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ , గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ (Gubretas Fertilizers) చీఫ్ ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ బంగారం నిధిని గుర్తించారు.
రాబోయే రెండేళ్లలో ఈ బంగారాన్ని తవ్వితీస్తామని ఫహ్రెటిన్ పోయ్రాజ్ అన్నారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బంగారు నిధి బటయపడిందన్న వార్తలతో గుబ్రేటాస్ షేర్ ధరలు 10 శాతం మేర ఎగబాకాయి.
టర్కీలో ఈ ఏడాది 38 టన్నుల బంగారం ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దాన్ని 100 టన్నులకు పెంచడమే తమ లక్ష్యమని సెప్టెంబరులో ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు