తెలంగాణాలో భారీగా తగ్గిన కేసులు
- December 26, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్, న్యూ స్ట్రెయిన్ భయాలు ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుండటం శుభపరిణామం అని చెప్పాలి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 317 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,84,391 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,76,244 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,618 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1529 కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







