హైదరాబాద్:ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో చేసిన సోనూసూద్..
- December 26, 2020
హైదరాబాద్:కరోనా సమయంలో వలసకార్మికులకు కొండంత అండగా నిలబడి వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నాటినుండి ఆయన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు.విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు . రీల్ లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. దేశమంతా సోనూసూద్ ను ప్రశంశలతో ముంచేస్తుంది. ఇటీవల సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి తెలిసిందే. అయితే... తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేటలో ని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ విజిట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







