కట్ చేసిన ఉల్లి పాయలు కవర్‌లో పెట్టి ఫిజ్‌లో పెడుతున్నారా..

కట్ చేసిన ఉల్లి పాయలు కవర్‌లో పెట్టి ఫిజ్‌లో పెడుతున్నారా..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు నిజమే.. కానీ కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలు విషంతో సమానమంటున్నారు పోషకాహార నిపుణులు. కత్తిరించిన ఉల్లిపాయలు బ్యాక్టీరియాను గ్రహిస్తాయి, కాబట్టి మీరు ఎప్పుడూ ఉల్లిపాయను ముక్కలు చేసి నిల్వ ఉంచినవి తినకూడదు ఎందుకంటే ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియాతో నిండి ఉంది. " ఒక ఉల్లిపాయను కట్ చేసి మరుసటి రోజు వంటలకి వాడితే కూడా ప్రమాదకరమని గుర్తుంచుకోండి, ఇది ఒక రాత్రికి కూడా చాలా విషపూరితంగా మారుతుంది, విషపూరిత బ్యాక్టీరియాను సృష్టిస్తుంది, దీన్ని తింటే కడుపులో అంటువ్యాధులను కలిగిస్తుంది. ఉల్లిపాయలు బ్యాక్టీరియాకు, ముఖ్యంగా ఉడికించని ఉల్లిపాయలకు భారీ అయస్కాంతం. ముక్కలు చేసిన ఉల్లిపాయలో కొంత భాగాన్ని నిల్వ ఉంచడానికి ప్రయత్నించవద్దు. మీరు దానిని జిప్-లాక్ బ్యాగ్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే కూడా సురక్షితం కాదు. "

ఉదాహరణకు మనకు పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు చాలా సార్లు ఎందుకుకో కారణం తెలియదు. బహుశా అది ఉల్లిపాయల వల్ల కావొచ్చు. ఉల్లిపాయను కట్ చేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు. ఉల్లిపాయలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనాలు ఉంటాయి. జార్జియా విశ్వవిద్యాలయంలోని ఆహార భద్రత కేంద్రం నివేదిక ప్రకారం కట్ చేసిన ఉల్లిపాయ నుండి విడుదలయ్యే రసం అనేక రకాల సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుందని తేలింది.

Back to Top