డిఎస్ఎఫ్: 12 గంటల మెగా సేల్‌లో 90 శాతం వరకు డిస్కౌంట్స్
- December 26, 2020
దుబాయ్:12 గంటల మెగా సేల్ శనివారం, డిసెంబర్ 26న ప్రారంభమయ్యింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్స్‌లో భాగంగా సేల్స్ వుంటాయి. ఈ ఏడాదికి సంబంధించి ఇదే సూపర్ సేల్. 90 శాతం వరకు డిస్కౌంట్లతో ప్రముఖ బ్రాండ్లు ఇక్కడ అందుబాటులో వుంటాయి. మాజిద్ అల్ ఫుత్తైమ్ మాల్ దీన్ని నిర్వహిస్తోంది. కనీసం 25 శాతం, గరిష్టంగా 90 శాతం డిస్కౌంట్లు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ మైసమ్, మై సిటీ సెంటర్ అల్ బర్షాన్ అలాగే సిటీ సెంటర్ అల్ షిందగలో ఈ సేల్ వర్తిస్తుంది. ఫ్యాషన్ లైన్స్, ఎలక్ట్రానిక్స్, కిడ్స్ వేర్లో ఈ డిస్కౌంట్స్ వుంటాయి. కాగా, 26వ ఎడిషన్ ఫెస్టివల్ జనవరి 30 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







