వలసదారులకు ఆమ్నెస్టీ: డిసెంబర్‌ 31తో ముగియనున్న గడువు

- December 26, 2020 , by Maagulf
వలసదారులకు ఆమ్నెస్టీ: డిసెంబర్‌ 31తో ముగియనున్న గడువు

మనామా:కాన్సులర్‌ సర్వీసులు అలాగే కార్మిక సమస్యలకు సంబంధించి భారత అంబాసిడర్‌ పియూష్‌ శ్రీవాస్తవ, కమ్యూనిటీ మెంబర్‌తో వర్చువల్గఆ సమావేశమయ్యారు. ఇండియన్‌ కమ్యూనిటీ వెల్‌ఫేర్‌ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు శ్రీవాస్తవ. కాన్సులర్‌ సేవలు అవసరమైనవారికి వాలంటీర్ల ద్వారా సాయం అందించే కార్యక్రమం పునఃప్రారంభమయ్యిందని ఆయన తెలిపారు. కోవిడ్‌ 19 పరీక్ష ధరను 60 బహ్రెయినీ దినార్లు  నుంచి 40 బహ్రెయినీ దినార్లకి తగ్గించిన బహ్రెయిన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారాయన. కాగా, ఇండియన్‌ ఎంబసీ 350 షార్ట్‌ వాలిడిటీ పాస్‌పోర్టుల్ని జారీ చేసిందనీ, తద్వారా బహ్రెయిన్‌లో తమ స్టేటస్‌ని రెగ్యులరైజ్‌ చేసుకోవడానికి వారికి వీలు కలుగుతుందని చెప్పారు. డిసెంబర్‌ 31తో వలసదారులకు అమ్నెస్టీ ముగియనుంది. ఇండియన్‌ ఎంబసీ ఎమర్జన్సీ టెలిఫోన్‌ నెంబర్‌ 00973 39418071 ను ఏమార్చి అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని శ్రీవాస్తవ ప్రస్తావించారు. ఈ తరహా ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com