ఏపీలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు...
- December 26, 2020
అమరావతి:ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఏపీలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,80,712 కి చేరింది. ఇందులో 8,69,920 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,700 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7092 కి చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







