పిల్లల సంరక్షణ కేంద్రంలో 124 మంది చిన్నారులు దత్తతకు సిద్ధం
- February 21, 2016
తల్లితండ్రుల చేత నిరాదరణకు గురికాబడి వదిలివేయబడిన 190 మంది చిన్నారులకు ఆశ్రయం దొరికింది.గత
ఏడాది124 మంది పిల్లలు ఒక సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నారని సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. అత్యధిక కుటుంబాలు ఈ పిల్లలను దత్తత చేసుకోవడానికి ముందుకు రావడం ఎంతో అభినందించదగిన విషయమన్నారు.బాలల సంరక్షణ కేంద్రంలో 124 మంది చిన్నారుల్లలో 86 మంది మగపిల్లలు కాగా, 38 మంది ఆడపిల్లలు ఉన్నారని తెలిపింది. ఈ విధంగా వదిలివేయబడిన పిల్లల జన్మకారకులు కొందరు శిక్ష తప్పించుకోవడా నికి ' అవాంఛిత ' పిల్లలను రహస్యంగా వదిలివేస్తున్నారని మరికొందరు తల్లితండ్రులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే లేదా వారు కారాగారంలో ఉన్నందున పిల్లలు దిక్కులేని వారుగా మిగిలిపోతున్నారని సంబంధిత శాఖ తెలిపింది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైనా నేపధ్యంలో పిల్లలను వదిలివేసేవారు ఇప్పటివరుకు లేరని చెబ్తూ, ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో అనాధ పిల్లలను దత్తత చేసుకొనేవారు తగ్గిపోతున్నారని పేర్కొంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం వివాహం కాకుండా పిల్లలను కనడం నిషేధమని కాని కొందరు ఆ తప్పును చేసి ఆ సంతానాన్ని రహస్యంగా వదిలించుకొనే యత్నాల ఫలితమే ఈ అనాధ పిల్లలని మంత్రిత్వశాఖ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







