తెలంగాణ లో కొత్తగా 205 కరోనా కేసులు
- December 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది... ఆదివారం కోవిడ్ బులెటిన్‌లో దాదాపు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆసంఖ్య అమాంతం తగ్గిపోయింది... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతిచెందగా.. 551 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,77,304కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో 1533 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని.. రివకరీ రేటు దస్త్రశంలో 95.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.27 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప ఏర్కొంది. అయితే, ఇవాళ ఉన్నట్టుండి కోవిడ్ కేసుల తగ్గిపోవడానికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమేనని చెప్పుకోవాలి ఎందుకంటే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 37 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా.. తాజా బులెటన్ ప్రకారం మాత్రం 27,244 శాంపిల్స్ మాత్రమే పరిశీలించారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
-హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష