కువైట్: 60,000 మంది డొమస్టిక్ వర్కర్ల రేషన్ కార్డులు రద్దు
- December 28, 2020_1609130173.jpg)
కువైట్ సిటీ:60 వేల మంది గృహ కార్మికుల రేషన్ కార్డులను రద్దు చేయనున్నట్లు కువైట్ ట్రేడ్ మినిస్ట్రి ప్రకటించింది. రద్దు చేయబోయే రేషన్ కార్డుల లబ్దిదారులు అంతా ప్రస్తుతం తమ యజమానుల దగ్గర పని చేయటం లేదని..చాలా మంది దేశం విడిచి వెళ్లారని మంత్రిత్వ శాఖ వివరించింది. కువైట్ లోని నిబంధనల మేరకు స్పాన్సర్లకు ఇచ్చే రేషన్ లో వారి దగ్గర పని చేసే డొమస్టిక్ వర్కర్లను కూడా చేరుస్తారు. దీంతో వాళ్లకు కూడా రేషన్ సరుకులో కోటా ఉంటుంది. అయితే..చాలా మంది ఇళ్లలో గృహ కార్మికులు పని మానేసి వేరే చోటికి వెళ్లినా..దేశం విడిచి వెళ్లినా ఆ వివరాలను స్పాన్సర్లు గోప్యంగా ఉంచుతున్నారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీంతో కార్మికుల రేషన్ కోటాను కూడా యజమానులు వినియోగించుకుంటున్నారని వివరించింది. తమ దృష్టికి వచ్చిన వివరాలతో ప్రస్తుతం 60 వేల మంది డొమస్టిక్ వర్కర్ల రేషన్ కోటాను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి ఏడాదిలో 4.5 మిలియన్ దినార్లు ఆదా కానుందని వివరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష