'ETCA' ఆధ్వర్యంలో తెలంగాణ NRI's మీట్ అండ్ గ్రీట్

- February 21, 2016 , by Maagulf

తేది 20/02/2016 ఆదివారం రోజున ఎమరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘ (ETCA) ఆధ్వర్యంలో "NRI's మీట్ అండ్ గ్రీట్ విత్  హోమ్ మినిస్టర్ "  కార్యక్రమం దుబాయ్ లోని డ్యున్స్ హోటల్లో సాయంత్రం 8గంటల నుండి 11 గంటల వరకు జరిగింది . 

ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గారు ముఖ్య అతిథులుగ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది గారు, లేబర్ సెక్రటరీ హర్ప్రీత్  సింగ్ గారు, టాంకాం ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డైరెక్టర్ యాకుబ్ నాయక్ గారు, మేనేజర్ శ్రీమతి భవాని గారు,తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్ రెడ్డి గారు, బహ్రెయిన్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ గారు హాజరైనారు.
ముందుగా సంఘ వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్ గారు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం సిద్దించిన తరువాత వివిధ సందర్భాలలో గల్ఫ్ సమస్యలపైన ఇచ్చిన ప్రతిపాదనలోని పలు సూచనలను స్వీకరించామని ప్రభుత్వం గతంలో  తెలిపినపుడు చాల సంతోషించామని ఇప్పుడు TOMCOM పేరుతో దళారీ వ్యవస్థను నిర్మూలించి,గల్ఫ్ లో ఉన్న అవకాశాల ఆధారంగా వివిధ కంపెనీలలో కావాల్సిన మ్యాన్ పవర్ ను  వివిధ విభాగాల్లో  శిక్షణ ఇచ్చి నియామకాలు జరిగే విధంగా మరియు దశల వారిగా సమస్యలను చేధించడానికి ప్రక్రియను మొదలుపెట్టి  వేసిన మొదటి అడుగును అభినందిస్తూ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని ప్రశంసిస్తూ వచ్చిన నాయకులకు ప్రతినిధులకు ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి గల్ఫ్ ప్రవాస బిడ్డల అందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం హోం , లేబర్ శాఖ మాత్యులు శ్రీ నాయిని నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వస్తున్న సంక్షేమానికి పాటుపడతామని స్వంత రాష్రంలో ఉపాధి అవకాశాలు కలిపిస్తు ఇకముందు ఎవరు కూడ అక్రమ గల్ఫ్ ఏజంట్ల చేతిలో మోసపోకుండ కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి ప్రజలకు ఉపయోగపడుతున్న తీరు గురించి కే.సి.ర్ యొక్క అంకుటిత దీక్ష మరియు పరిపాలన గురించి తెలియజేసారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి గల్ఫ్ దేశాల్లో ఉన్న సంఘాల సహకారం తప్పని సరి అని అందరు కలిసి కట్టుగా పనిచేయాలనీ పిలుపునిచ్చారు . దుబాయ్ వచ్చిన కూడ ఇక్కడి ప్రజల ప్రేమ ఆత్మీయత తెలంగాణాలో ఉన్నట్టే ఉందని, ఇక్కడ ఉంటూ కూడ ఆపదలో ఉన్నవారికీ ETCA  చేస్తున్న సేవ, తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో భాగంగా చేస్తున్న సాంస్కృతిక  కార్యక్రమాలను అభినందించారు.  
ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహా రెడ్డి గారు  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నూతనంగా ఏర్పాటు చేసిన  "తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కంపెనీ(TOMCOM) " గురించి తెలియజేస్తూ, ఎవరైతే తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తారో, వారు క్షేమంగా తిరిగి స్వస్థలాలకు చేరుకోవడానికి తోడ్పడడం మరియు బోగస్ ఏజెన్సీ లతో మోసాలు చేస్తున్న దళారీ పద్ధతిని రూపు మాపడం అనేవి ఈ సంస్థ  ముఖ్య ఉద్దేశాలు అని పేర్కొన్నారు. 
ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు వీసా గడువు ముగియగానే ఇండియాకు తిరిగి వచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోసం వచ్చే వారు వర్క్ వీసా మీద రావడం శ్రేయస్కరం. కానీ దళారీల మాటలు నమ్మి విజిట్ల వీసా లతో  గల్ఫ్ దేశాల్లో అడుగు పెడుతున్నారు. వీసా గడువు ముగియగానే జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం  ప్రభుత్వం TOMCOM ను ఏర్పాటు చేసింది అని,
కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ గల్ఫ్ దేశాల్లో వీసాలు మరియు రిక్రూట్ మెంట్ల పై దృష్టి సారించింది అని, 
దుబాయ్ లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వారికి కావాల్సిన మ్యాన్ పవర్ శిక్షణ ఇచ్చి పంపుతామన్నారు. ఈ సంవత్సరంలో 1000 మందిని లక్ష్యంగా చేసుకొని రెండో విడత 5000 మందిని మూడో సంవత్సరానికి గాను 10 వేల మందికి పైగా ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు చేస్తామన్నారు . 
విదేశీ ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించకుండా ఈ సంస్థలో పేరు నమోదు చేసుకుని గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ నియామకాలు పొందాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TOMCOM  డైరెక్టర్ శ్రీమతి భవాని గారు, ETCA వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పిచర కిరణ్ కుమార్ గారు, చీఫ్ అడ్వైసర్ శ్రీ మంచుకొండ వెంకటేశ్వర్లు, కొండం అశోక్ రెడ్డి, సెక్రెటరి జనరల్ శ్రీ ప్రవీణ్ కుమార్, గాంధారి సత్యనారాయణ మరియు కోర్ కమిటి & ఎక్ష్ క్యుటివ్ కమిటి సభ్యులు మరియు TOMCOM సంస్థకు చెందిన  ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com