విశ్వక్‌సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
- December 28, 2020
హైదరాబాద్:టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు పీవీపీ సినిమా,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై యంగ్ హీరో విశ్వక్‌సేన్ కథానాయకుడిగా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తుకి దిల్‌రాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఫిబ్రవరి మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నేషనల్ అవార్డ్‌ను అందుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు