'డాన్స్ ప్లస్' లో మోనాల్
- December 28, 2020
బిగ్‌బాస్ ముందు ఐదు తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. ఇక ఇంటికి తట్టా బుట్టా సర్దేయాలని అనుకుంటున్న సమయంలో ఆమెకు బిగ్‌బాస్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4లోని 16 మంది కంటెస్టెంట్స్‌లో మోనాల్ కూడా ఒకటి. బిగ్‌బాస్‌లో అభిజీత్, అఖిల్, మోనాల్ లవ్‌ట్రాక్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. షోలో మసాలా పోకూడదనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఆమెను దాదాపు చివరి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేలా చూసుకున్నారు. ఏదేతేనేం.. ఇప్పుడు బిగ్‌బాస్ 4 నుంచి వచ్చిన క్రేజ్‌ను మోనాల్ క్యాష్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఓంకార్ నిర్వహించే డాన్స్ ప్లస్ అనే కార్యక్రమానికి మోనాల్ హోస్ట్‌గా కనిపించింది. చూడాలి మరి మోనాల్ డాన్స్ ప్లస్ ఎంత వరకు కలిసి వస్తుందో...!
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







