లులు హైపర్ మార్కెట్ న్యూ ఇయర్ ధమాకా..భారీ డిస్కౌంట్లతో సేల్స్ షురూ
- December 29, 2020
మనామా:బహ్రెయిన్ లోని లులు హైపర్ మార్కెట్ కొత్త సంత్సరం కానుకగా వినియోగదారులకు అదిరిపోయే అఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 29 నుంచి జనవరి 2 వరకు కస్టమర్లు అందరూ లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేసుకునేలా బిగ్ బ్యాంగ్ ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల దగ్గర్నుంచి టీవీలు, ఎయిర్ ఫ్రైయర్స్, దుస్తులు, పిల్లల ఆట బొమ్మలు, వంట సరుకులు, సబ్బులు ఇలా అన్ని వస్తువులను తగ్గింపు ధరలకు అందించనుంది. ఇక డిసెంబర్ 31 మరిన్ని ఆఫర్లు ఉండనున్నాయి. ఎంపిక చేసిన వస్తువులను కేవలం సగం ధరలకే అమ్మనున్నారు. స్టోర్స్ లో రద్దీని నివారించేందుకు వినియోగదారులు లులు షాపింగ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు వివరించారు. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చిన వారికి 9 జనవరి నాటికి డెలివరీ చేస్తామని తెలిపింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు







