ప్రతి నెల ప్రవాస కార్మికులతో బ్రేక్ ఫాస్ట్..ఇండియన్ కాన్సుల్ జనరల్ కొత్త ప్రొగ్రాం

- December 29, 2020 , by Maagulf
ప్రతి నెల ప్రవాస కార్మికులతో బ్రేక్ ఫాస్ట్..ఇండియన్ కాన్సుల్ జనరల్ కొత్త ప్రొగ్రాం

దుబాయ్: కొత్త ఏడాదిలో ప్రతి నెల దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్ లోని ప్రవాస భారతీయ కార్మికులతో బ్రేక్ ఫాస్ట్ ప్రొగ్రాం నిర్వహించున్నట్లు భారత దౌత్యవేత డాక్టర్ అమన్ పురి స్పష్టం చేశారు. వారి నివాసం ఉండే చోటుకే వెళ్లి..వాళ్లతో అల్పహారం చేస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని, వారికి తగిన జాగ్రత్తలు, సూచనలు చెప్పటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో భారతీయులకు సహాయ కేంద్రంగా నిలబడుతున్న ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర-పీబీఎస్కే సహాయంతో 'బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్' పేరుతో నిర్వహిస్తున్నారు. జనవరి 1న శుక్రవారం ఉదయం 10 గంటలకు దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ పార్క్ లోని ఎల్ అండ్ టీ కార్మికుల నివాస సముదాయంలో తొలి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడి కార్మికులతో కాన్సుల్ జనరల్ అమన్ పురి బ్రేక్ ఫాస్ట్ నిర్వహించి..వారికి ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యతను, నైపుణ్యతను పెంపొందించుకునే అవకాశాలను, ఆరోగ్య భద్రత, సూచనలను చేయనున్నారు. PBSK ప్రవాస కార్మికులకు అందిస్తున్న సేవలను వివరించి..PBSK సాయంతో ఆర్ధిక క్రమశిక్షణ, నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించనున్నారు. అయితే..ప్రతి నెల తొలి శుక్రవారం బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే..ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యూఏఈలోని కార్మికుల కష్ట నష్టాలు, వారి సమస్యలను నేరుగా వారి నుంచి తెలుసుకొని వారికి తగిన సాయం చేసేందుకు..వారి నుంచి నేరుగా సమాచారం పొందెందుకు బ్రేక్ ఫాస్ట్ ప్రొగ్రాం నిర్వహిస్తున్నట్లు అమన్ పురి వెల్లడించారు. అంతేకాదు..ప్రతి కార్మికుడి దగ్గర పీబీఎస్కే హెల్ప్ లైన్ నెంబర్ 800 46342 ఉండాలని, PBSK నుంచి వచ్చే సూచనలతో సమస్యల పరిష్కారం సులువు అవుతుందని అమన్ పురి వివరించారు. యూఏఈలోని బ్లూ కాలర్ కార్మికులు భారతీయ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని..వారి సంక్షేమానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com