ఆన్లైన్ మోసంలో కొత్త కోణం: తస్మాత్ జాగ్రత్త
- February 21, 2016'సెలబ్ కాన్ మెన్' అనే కొత్త ఆన్లైన్ మోసం వెలుగులోకి వస్తోంది. ప్రముఖుల పేర్లతో ఆన్లైన్ వేదికగా ఈ మోసాలు జరుగుతున్నాయని షార్జా పోలీసులు గుర్తించారు. విదేశాలకు వెళ్ళి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నామనీ, తమకు ఆర్థిక సహాయం చేస్తే, స్వదేశానికి రాగానే డబ్బులు తిరిగిచ్చేస్తామని ప్రముఖుల పేర్లతో ఆన్లైన్లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివారి నుంచి ఫ్రాడ్ మెసేజ్‌లు లేదా మెయిల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని షార్జా పోలీసులు హెచ్చరించారు. ఏదోలా పరిచయాలు ముందే పెంచుకుని, వాటిని ఆన్లైన్ మోసాలకు వినియోగించుకుంటున్న సందర్భాలూ చూస్తున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని షార్జా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు