దక్షిణి కొరియా సిద్ధం చేసిన కృత్రిమ సూర్యుడు.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన శాస్త్రవేత్తలు
- December 30, 2020
ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో పడ్డాయి. దీనికోసం విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. చైనా ఇటీవలే న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిని 'హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్' అని పిలుస్తుండగా.. ఇది సూర్యుడి కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కేస్టార్(KSTAR) అనే కృత్రిమ సూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. నిజానికి సూర్యుడిలోని ఉష్ణోగ్రతలు 1.5 కోట్ల డిగ్రీలకు పరిమితం కాగా, కేస్టార్‌లో మాత్రం 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలను 20 సెకన్ల పాటు కొనసాగించి దక్షిణి కొరియా శాస్ర్తవేత్తలు ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టగా, దక్షిణ కొరియాలోని 'కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ'లో ఈ ప్రయోగం నిర్వహించారు. ఇంతకంటే ముందు 100 మిలియన్ డిగ్రీల వేడిని పుట్టించినా, 10 సెకన్ల కన్నా ఎక్కువ సమయం కొనసాగలేదు. దాంతో గత ప్రయత్నాలతో పోలిస్తే, ఇది గణనీయమైన మెరుగుదలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష