అమెరికా చేరిన కొత్త కరోనా..ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనప్పటికి వైరస్ బారిన పడ్డ యువకుడు
- December 30, 2020
వాషింగ్టన్: ఇప్పుడిప్పుడే కోవిడ్ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని కొత్త కరోనా వైరస్ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. బ్రిటన్‌లో మొదలైన ఈ కొత్త కరోనా వ్యాప్తి తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరింది. ఇప్పటికే కోవిడ్‌తో కకావికలమైన అమెరికాను కొత్త కరోనా వైరస్ మరింత భయపెట్టనుంది. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేర్డ్ పొలిస్ తెలిపారు. ఈ కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఇక బ్రిటన్‌లో కొత్త వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి అమెరికా ఆ దేశం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు చూపించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక మనదేశంలోను కొత్త కరోనా కేసులు 20కి చేరుకున్నాయి. నిన్న ఆరు కేసులు వెలుగు చూడగా.. తాజాగా నేడు 14 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







