'వాహనరహిత దినోత్సవం' లో ఉత్సాహంగా పాల్గొన్న దుబాయ్ నివాసితులు

- February 21, 2016 , by Maagulf
'వాహనరహిత దినోత్సవం' లో ఉత్సాహంగా పాల్గొన్న దుబాయ్ నివాసితులు

వందలాదిమంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా  పర్యావరణ స్నేహపూర్వక వాహనాలతో దుబాయ్ లో సందడి చేశారు, స్థానిక మునిసిపాలిటి నిర్వహించిన ' కారు అవసరం లేని ఉచిత ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అసమా అల్ మర్రి అనే మహిళ అల్ రాశిదియ నుండి మెట్రో ఎక్కి దుబాయ్ మునిసిపాలిటికి వచ్చారు. ప్రబుత్వ, ప్రైవేటు, పోలీస్,  అంబులెన్సు తో సహా ఈ కారు అవసరం లేని  కార్యక్రమంలో పాల్గొనడం చూడటానికి ఎంతో ఘనతగా ఉందని ఆమె అన్నారు. తాను ఉద్యోగ విధులకు వెళ్ళేటప్పుడు తన స్వంత కారులోనే వెళతానని, అందుకు కారణం తనకు 9 నెలల వయసున్న చిన్నారి ఉందని , ఆ బిడ్డకు అవసరమైన సరంజామాను తాను కారులో ఉంచుకొంటానని అందుకే తాను కారును ఉపయోగిస్తున్నట్లు లేదంటే తాను ఎల్లప్పుడు మెత్రోలోనే ప్రయాణిస్తానని ఆమె తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీలో ఉద్యోగినిగా పనిచేస్తున్నానని  గత 7 ఏళ్ళుగా దుబాయ్ మునిసిపాలిటి నిర్వహిస్తున్న  ' వాహనరహిత దినోత్సవం ' కారణంగా ప్రజలలో పర్యావరణం పట్ల ఎంతో అవగాహన పెరిగిందని అన్నారు. ఈ తరహా అవగాహన కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను కొంత మేరకు తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

          

           
              
                    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com