నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
- December 31, 2020
ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపధ్యంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని గౌరవ గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపధ్యంలో ఈ విడత ఆకార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు