జనవరి లో పెళ్లి..వెంకన్న సన్నిధిలో సునీత
- December 31, 2020
ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్మెంట్ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందటానికి వచ్చానన్నారు. లాక్ డౌన్లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
కాగా, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో డిసెంబర్ 20 ఆదివారం రాత్రి సునీత, రామ్ల ప్రీవెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ ఈ కార్యక్రమానికి హజరయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష