బ్యాంక్ ఖాతాదారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు సరికొత్త యాప్‌లతో...

- February 22, 2016 , by Maagulf
బ్యాంక్ ఖాతాదారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు సరికొత్త యాప్‌లతో...

:బ్యాంక్ ఖాతాదారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు సరికొత్త యాప్‌లతో ముందుకొస్తున్నారు. ఈ యాప్‌లను బ్యాంక్ యాజమాన్యాలతో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బ్యాంకు పనివేళలు ముగిశాక ఎవరూ ప్రవేశించిన అలారం మోగి అప్రమత్తత చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యాప్‌లు తెస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ యాజమాన్యాలు, అధికారులు, సిబ్బంది తీరును పరిశీలించిన పోలీసులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 1400కి పైగా బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణపై సమగ్ర సర్వేను నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.70 శాతానికి పైగా బ్యాంకర్ల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఇది తీవ్ర ప్రమాదంగా భావించిన సైబరాబాద్ పోలీసులు ప్రతి బ్యాంక్, ఏటీఎంల్లో ఉండాల్సిన అత్యాధునిక సెక్యూరిటీ అంశాలను తప్పనిసరిగా పాటించే విధంగా నిబంధనలను అమల్లోకి తెలిసినట్లు తెలిసింది.
ప్రజాధనం రక్షణలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ అధికారులపై నమోదైన కేసు స్పష్టం చేసింది. ఇక మీదట ఎవరూ అలసత్వం వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో బ్యాంకర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి వారు తీసుకోవాల్సిన చర్యలను సూచించనున్నారు.భద్రత చర్యలపై అవగాహన కల్పిస్తూ..ప్రజాధనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంక్ యాజమాన్యలపై సైబరాబాద్ పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. పలు బ్యాంక్ దోపీడీ యత్నాలు, దోపిడీలు, ఏటీఎం చోరీ యత్నాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు చాలా సందర్భాల్లో బ్యాంక్ యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని బయటపెట్టారు. ఖాతాదారుల సొమ్ముకు ముప్పు తెచ్చే విధంగా ఉండడంతో పోలీసులు అనేక సందర్భాల్లో భద్రత చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే అంశాలను నోటిఫికేషన్‌లు, అవగాహన కార్యక్రమాలు, సమావేశాల ద్వారా సూచనలను జారీ చేశారు. అయినా అధిక సంఖ్యలో బ్యాంక్ యాజమాన్యాలు తమ అజాగ్రత్తను యధావిధిగా కొనసాగిస్తున్నాయని సైబరాబాద్ పోలీసులు తాజాగా గుర్తించారు. తాజాగా ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ సంఘటనలో కూడా సిబ్బంది, యాజమాన్యాల తప్పు స్పష్టమైంది.పోలీసు యాక్షన్‌తో..ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు బ్యాంక్ ఖాతాదారుల సొమ్మును భద్రంగా ఉండే విధంగా సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సాంకేతిక నిపుణుల సహాయంతో యాప్‌లను రెడీ చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే పలు బ్యాంక్‌లు పాటిస్తున్న సెన్సర్ అలారం సిస్టంను ఇక ప్రతి బ్యాంక్, ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసుకునేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ యాప్‌లు ఇక బ్యాంక్ వేళలు ముగిసిన తర్వాత ఎవరూ ఎంట్రీ అయినా అలారంతో అప్రమత్తం చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు.బ్యాంక్‌లు మూసేసిన తర్వాత అనుమానాస్పద రీతిలో ఎవరూ ప్రవేశించిన వెంటనే సెన్సర్‌ల ద్వారా అలారం మోగి ఆ విషయాన్ని సంబంధిత ఎనిమిది మంది సెల్‌ఫోన్‌లకు మెసెజ్ వచ్చే విధంగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ప్రతి ఒక్క బ్యాంక్ యాజామాన్యాలు ఏర్పాటు చేసుకునే విధంగా పోలీసులు అవగాహన కల్పించనున్నారు. ఈ విధంగా సైబరాబాద్ పోలీసులు తమ వంతు బాధ్యతగా బ్యాంక్ ఖాతాదారుల శ్రేయస్సు కోసం బ్యాంకర్‌ల నిర్లక్ష్యాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com