ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు
- January 02, 2021
విజయవాడ: రామతీర్థం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో జారీ చేశారు. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ల పదవి నుంచి ఉద్వాసన పలికింది. పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్ పదవుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి, సీతమ్మవారి కొలనులో పడేసిన సంగతి తెలిసిందే.. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష