జనవరి 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్

- January 02, 2021 , by Maagulf
జనవరి 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్

హైదరాబాద్:నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం సంయుక్తంగా ఈనెల 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్ ను నిర్వహిస్తున్నట్లు సిస్టర్ లిసీ జోసెఫ్,మంద భీంరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు.గల్ఫ్  కార్మికులకు 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలని), కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 

ఈనెల 9న ఢిల్లీ నిర్వహించే 16వ 'ప్రవాసి భారతీయ దివస్' సంపన్నులైన ఎన్నారైల జాతర అని, గల్ఫ్ దేశాలలో కష్టాలు పడుతున్న వలస కార్మికుల సమస్యలను చర్చించడానికి ఇందులో తగిన ప్రాధాన్యత ఇవ్వనందున తాము మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. 

కోవిడ్19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యం,జీవనోపాధి,ఆదాయంపై భారీ ప్రభావాన్ని చూపింది.గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో వాపస్ వచ్చారు,భారీగా నష్టపోయారు.స్వదేశానికి తిరిగి వచ్చిన చాలామంది కార్మికులు వారి జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు పొందలేకపోయారు.భారత ప్రభుత్వ స్పందన వలసకార్మికుల హక్కుల రక్షణ,సంక్షేమాన్ని కోరేదిగా లేదు.గల్ఫ్ దేశాలలో పనిచేయాలనుకునే కార్మికుల కనీస వేతనాలను 30 నుండి 50 శాతం తగ్గించిన భారత ప్రభుత్వం లక్షలాది మంది వలసజీవుల ఆశలను అడియాశలు చేసిందని  లిసీ, భీంరెడ్డి అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com