2021 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్
- January 02, 2021
మస్కట్: కొత్త సంవత్సరం సంధర్భంగా ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు చేతులమీదుగా సంస్థ ప్రతినిధులు మరియు సభ్యుల సమక్షంలో 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా నరేంద్ర మాట్లాడుతూ "గత సంవత్సరం అందరికి ఒక పీడకల వంటిది అని కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాని ఒక్క విషయం లో మాత్రం కరోనా కు కృతజ్ఞతలు తెలపాలన్నారు; కరోనా మనకు ఆరోగ్యంగా ఎలా ఉండాలో, సాటివారి పట్ల దయ మరియు ఇతరులకు సహాయం చేయడం ను నేర్పింది" అని అన్నారు.

ఈ సంధర్భంగా ఆయన కరోనా లోక్డౌన్ సమయంలో ముందుకు వచ్చి సహాయం చేసిన
'ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' ప్రతినిధులను మరియు కార్యకర్తలను అభినందించారు. తదుపరి ఈ సంవత్సరం లో సంస్థ కార్యక్రమాలు మరియు భవిష్యత్ ప్రణాళికలను సంస్థ సభ్యులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో మంచికట్ల కుమార్,వేమాన్ కుమార్ కాశ, మామిడి శ్యాం,వడ్లపట్ల మురళి,చెని గురువయ్య,గరిగే రమేష్,చెని ప్రభాకర్,సుద్దాల గంగరాజం, కోదమగారి రాజు, దినేష్ మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష