'చెక్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!

- January 03, 2021 , by Maagulf
\'చెక్\' సినిమా  ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

హైదరాబాద్:ప్రీత్  సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . "జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ ,  కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.

ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్  మాట్లాడుతూ "నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు  కళ్యాణి మాలిక్  ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్  యేలేటి - కళ్యాణి మాలిక్ 

కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే.  ఔట్  పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో  సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది  '' అని చెప్పారు. 

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన  తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా  గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్  , ఆర్ట్ : వివేక్ అన్నామలై  , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్,

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com