షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్
- May 28, 2015
షార్జాలోని 48 ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల్ని పెంచుకునేందుకు షార్జా ఎడ్యుకేషన్ జోన్ అనుమతినిచ్చింది. ఈ అనుమతితో 2015-16 విద్యా సంవత్సరానికిగాను 3 నుంచి 10 శాతం స్కూలు ఫీజుల్లో పెరుగుదల ఉండనుంది. షార్జాకి చెందిన ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్కూళ్ళ నుంచి వచ్చిన విన్నపం మేరకు ఫీజు పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడిరదని చెప్పారు. వివిధ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు, స్టాండర్డ్స్‌ని బట్టి ఫీజుల పెంపు శాతం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే అత్యధికంగా ఫీజులు ఉండటంతో వాటికి మాత్రం పెంపును అంగీకరించలేదు. అమెరికన్, బ్రిటిష్, ఇండియన్ కరికులమ్ స్కూల్స్ ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 60 స్కూళ్ళు ఫీజు పెంపు గురించి అభ్యర్థించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి పరిమితమైంది. ఫీజుల పెంపుపై ఓ కమిటీ స్కూళ్ళు అన్నిటినీ సందర్శించి సౌకర్యాలను పరిశీలించి పెంపుపై నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫీజు పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.
--- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







