‘సామ్‌జామ్’తో హీరో నాగచైతన్య
- January 03, 2021
హైదరాబాద్:అక్కినేని సమంత ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘సామ్‌జామ్.. సమంత’ షోతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో సినీ ప్రముఖులతో ఆమె సరదాగా సంభాషిస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు తెలుగు సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకుంది.
తాజాగా ‘సామ్‌జామ్’ కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. కాగా నాగచైతన్య రావడం షోపై ఆసక్తి పెంచుతోంది. ప్రముఖ సెలబ్రిటీ జోడీగా పేరొందిన ‘చైసామ్’ చేసే సందడి ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది. ఈ మేరకు ‘ఆహా’ తన ట్విటర్లో షోకు సంబంధించి వీరిద్దరి ఫొటోలు ఉంచి ‘చైసామ్’ కెమెస్ట్రీ చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు