కరోనా కొత్త స్ట్రెయిన్...30 దేశాలకు పాకేసింది
- January 04, 2021
కరోనా వైరస్ కంటే ఇప్పడు కొత్త స్ట్రెయిన్ ప్రకంపంనలు సృష్టిస్తోంది.. బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్ అనుకున్నదానికంటే వేగంగా వ్యాపిస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించినా... వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఏకంగా 30 దేశాలకు పాకింది కొత్తరకం వైరస్. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. తొలి వైరస్ వ్యాప్తి నివారణలో వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
ఇక, కొత్తరరం వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్ పార్క్‌లు పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్‌లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అటు అమెరికాలో కరోనా స్ట్రెయిన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయ్. ఇప్పటికే ఈ వైరస్ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న అమెరికాలో ఈ కొత్త రకం మరింత కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా పేషెంట్లతో ఇప్పటికే నిండిపోయిన హాస్పిటల్స్‌కు ఇది పెనుసవాల్‌గా మారనుంది. వియత్నాంతో తొలి కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు నుంచి కొత్త రకం వైరస్ సోకింది. వెంటనే ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. యూకే నుంచి వచ్చే తమవారి కోసం మాత్రమే ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది. మరోవైపు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటి నాలుగు కోట్ల మందిపైకా వ్యాక్సిన్ అందజేశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు పదిలక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందజేశారు. కొత్త వైరస్‌నూ ఈ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయని భావిస్తున్నప్పటికీ.. అందరికీ వ్యాక్సిన్ అందేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







