ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అబుధాబి ఆరోగ్య శాఖ

- January 05, 2021 , by Maagulf
ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అబుధాబి ఆరోగ్య శాఖ

అబుధాబి:కోవిడ్ 19ని సమూలంగా అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న అబుధాబి ఆరోగ్య శాఖ యంత్రాంగం..కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను ప్రారంభించింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది. వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలపై ప్రజల్లో ఇంకా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు అధికారులు. సమాజంలోని ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని పిలుపునిచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైన ఫలితాలు సాధించిన తర్వాతే తాము వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కోవిడ్ 19 పరివర్తనం చెందుతూ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం తమ బాధ్యతగా దేశ ప్రజలు అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తారని నమ్ముతున్నామని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com