తెలంగాణలో 253 కోవిడ్ పాజిటివ్ కేసులు
- January 05, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 253 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 317 మంది కరోనా బారినపడి కోలుకున్నారు.. ఇక, మరో ముగ్గురు కరోనాతో మృతిచెందారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,81,400 మంది రికవరీ అయ్యారు.. మృతుల సంఖ్య 1554కి పెరిగింది... మరోవైపు.. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితం అయ్యింది.. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.2 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.71 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,039 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. కోవిడ్ బులెటిన్ ప్రకారం 42,485 శాంపిల్స్ పరీక్షించారు.. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 70,61,049కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







