ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూత..
- January 05, 2021
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. 1988లో మురళీ కృష్ణుడు మూవీ ద్వారా వెన్నెలకంటి లిరిసిస్ట్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి, టక్కరి దొంగ, వస్తాడు నా రాజు, చెప్పాలని ఉంది ఇలా పలు హిట్ సినిమాలకు ఆయన సాహిత్యం అందించారు. ఇక తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ చిత్రాలకు ఆయన డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. చివరగా గతేడాది పెంగ్విన్ చిత్రానికి ఆయన లిరిక్ రైటర్‌గా పనిచేశారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమార్ శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు రైటర్‌గా పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు రాకేందు మౌళి నటుడిగా, రిలిక్స్ రైటర్‌గా, సింగర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష