‘శూర్పణఖ’ లో పురావస్తు శాస్త్రవేత్తగా రెజీనా
- January 06, 2021హైదరాబాద్:హీరోయిన్ రెజీనా, అడవి శేష్ నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే.. తాజాగా ‘శూర్పణఖ’గా మరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెజీనా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది రెజీనా. ఈ సినిమాకు తెలుగులో ‘నేనేనా’ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్