ఎట్టకేలకు విడుదల అవుతున్న రానా ‘అరణ్య’
- January 06, 2021
హైదరాబాద్:టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ వెళ్తున్నాడు. కాగా రానా నటిస్తున్న ‘అరణ్య’ చిత్రం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు రానా రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ప్రభు సోలోమాన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను గతేడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాను థియేటర్లు తెరుచుకున్న తరువాతే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఏనుగులతో రానా అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో తమిళ హీరో విష్ణు విశాల్, బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియా పిల్గాన్కర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో రానా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు