డిజిటల్ ముకీమ్ ఐడీని ప్రారంభించిన జవజాత్

- January 07, 2021 , by Maagulf
డిజిటల్ ముకీమ్ ఐడీని ప్రారంభించిన జవజాత్

రియాద్:మీ గుర్తింపు కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్, రెసిడెన్సీ పర్మిట్ ను వెంట తీసుకురావటం మర్చిపోయారా? అయినా ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ చేపట్టిన డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకుంటే ఇక మీ వెంట ఎలాంటి గుర్తింపు కార్డులు, లైసెన్సులను వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరిచిపోయామనే కంగారు పడాల్సిన అవసరం లేదు. 'ది న్యూ అబ్షెర్ ఇండివిడ్యువల్స్' పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు, లైసెన్సులను డిజిటల్ రూపంలో స్మార్ట్ ఫోన్ లోనే సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా..డిజిటల్ ఐడీ కార్డులను క్యారీ చేసే అవకాశం ఉంటుంది. ఫీల్డ్ అధికారులు ఎప్పుడు అడిగినా..స్మార్ట్ ఫోన్ లో చేసుకున్న ఐడీ కార్డులను చూపించే వీలుంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ పర్మిట్, జాతీయ గుర్తింపు కార్డులను తనిఖీ అధికారులు ఎప్పుడు అడిగినా చూపించొచ్చు. అలాగే బ్యాంక్ లావాదేవీలు, కంపెనీ యాజమాన్యాలకు కూడా డిజిటల్ ఐడీ కార్డులను పరిగణలోనికి తీసుకోనున్నాయి. కింగ్డమ్ వెలుపల కూడా డిజిటల్ ఐడీ కార్డులను వినియోగించుకోవచ్చు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com