పేరుపాలెం సౌత్ లో అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ

- February 22, 2016 , by Maagulf
పేరుపాలెం సౌత్ లో అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలోని పేరుపాలెం సౌత్లో రూ.5కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం భూమిపూజ చేశారు. సంసద్ఆదర్శ్గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సర్పంచి సోమిశెట్టి రంగనాథ్అధ్యక్షతన నిర్వహించిన సభలో చిరంజీవి మాట్లాడుతూ.. పేరుపాలెం సౌత్గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండడంతో దత్తత తీసుకున్నానని చెప్పారు. భవిష్యత్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో నూతన జూనియర్కళాశాల, పీహెచ్సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com