ట్రాఫిక్ జరీమానా నుంచి 35 శాతం తగ్గింపు పొందండిలా

- January 07, 2021 , by Maagulf
ట్రాఫిక్ జరీమానా నుంచి 35 శాతం తగ్గింపు పొందండిలా

అబుధాబి:ఉల్లంఘన జరిగిన 60 రోజుల్లోపు జరీమానా చెల్లిస్తే, 35 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అబుధాబి పోలీస్ వెల్లడించడం జరిగింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అబుధాబి పోలీస్ వెల్లడించారు. వాహనారులు తమ జరీమానాల చెల్లింపుకి సంబంధించి ‘సులభతరమైన వెసులుబాటు’ కల్పించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది అబుదాబీ పోలీస్. ఇంపౌండ్ వెహికిల్స్‌కి కూడా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 22తో జరీమానాల చెల్లింపుకి సంబంధించి రాయితీ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అబుధాబి పోలీస్ వెబ్ సైట్ అలాగే అబుధాబి పోలీస్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com