7 భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’
- January 07, 2021
హైదరాబాద్:బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ “రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అధ్భుతమైన స్పందన లభిస్తోంది” అని చెప్పారు.
నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీ, తమిళంతో పాటు హిందీలోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నాం. రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులనీ ఆకట్టుకుంటుంది. అలాగే తెలుగు వెర్షన్ గ్రేట్ ఇండియాఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్ లో కూడా విడుదల చేస్తున్నాం. అమెరికా తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయిలలో రిలీజ్ చేస్తున్నాం. వసూళ్ల కోణంలో కాకుండా ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయా ఏరియాల పరిస్థితుల్ని బట్టి కొన్ని కొన్నిచోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఏది ఏమైనా ‘రెడ్’ చిత్రం ఈ సంక్రాంతికి మంచి అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







