కువైట్: సిక్ లీవ్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠా..ముగ్గురు అరెస్ట్
- January 07, 2021
కువైట్ సిటీ:సిక్ లీవ్ లను డాక్టర్ల సిఫార్సుకు బదులు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టు రట్టు అయ్యింది. నిందితులు కువైట్ ఆరోగ్య శాఖలో డేటా ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఠాలో ముగ్గురు ఉద్యోగులను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..మరొకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు కువైటీయన్లు. డేటా ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు...డాక్టర్ రిపోర్ట్ కు బదులు తామే స్వయంగా సిక్ లీవ్ సర్టిఫికెట్లను సిద్ధం చేసినట్లు..మూడో వ్యక్తి స్టాప్ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోర్జరీ రిపోర్ట్స్ అదాన్ ఆస్పత్రి కి చెందిన డాక్టర్ పేరుతో 2017 సీల్ వేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక నాలుగో వ్యక్తి సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష