జనవరి 14న ‘వకీల్ సాబ్’ టీజర్
- January 07, 2021
హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. సంక్రాంతి కానుకగా చిత్రం నుండి టీజర్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఇచ్చింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లీక్ ఫొటోలతో తెగ సంబరపడ్డ పవన్ అభిమానులు.. సంక్రాంతి రోజున వకీల్ సాబ్ టీజర్ తో పండగ జరుపుకోనున్నారు. అయితే ‘వకీల్ సాబ్’ నుంచి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు నిరాశచెందారు. 2020లో ట్విట్టర్‌లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన దాని బట్టి ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







