న్యూ ఢిల్లీ:రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు
- January 08, 2021
న్యూ ఢిల్లీ:రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌లు చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో 41 రైతు సంఘాల నేతలు పాల్గొంటున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. కేంద్రం మాత్రం సాగు చట్టాల రద్దు మినహా ఏదైనా పరిశీలిస్తామని చెబుతోంది. అటు.. చర్చలకు ముందు అమిత్ షాతో వ్యవసాయ మంత్రి తోమర్ భేటీ అయ్యారు. ఇదివరకే ఏడు సార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. అయితే రైతు సంఘాలు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంతో అవేవీ ఫలించలేదు. ప్రభుత్వం మాత్రం సవరణలకు సిద్ధమంటోంది. కానీ చట్టాల రద్దుకు అంగీకరించడం లేదు. ఇదే అంశంపై రైతు సంఘాలు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాయి. ఈ నెల 11న ఆ కేసు విచారణకు రానుంది. ఇక ఇవాళ ఎనిమిదోసారి చర్చలు జరుపుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష