భారత్ లో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు..
- January 08, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 82 స్ట్రెయిన్ వైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. జనవరి 6న ఈ సంఖ్య 73గా ఉంది. స్ట్రెయిన్ సోకినవారి పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.వారిని సింగ్ రూమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది.ఈ వైరస్ సోకినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
స్ట్రెయిన్ వైరస్ కట్టడిని అడ్డుకునేందుకు కేంద్రం భారత్-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బ్యాన్ ఎత్తివేశారు. జనవరి 6న భారత్ నుంచి యూకేకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.. నేడు యూకే-భారత్ సేవలు పునరుద్ధరించారు.అయితే బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు నిబంధన విధించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష