'వేదాంతం రాఘవయ్య' షూటింగ్ ప్రారంభం
- January 09, 2021
హైదరాబాద్:సునీల్ హీరోగా నటిస్తోన్న చిత్రం `వేదాంతం రాఘవయ్య`. సి చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట, గోపిఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల ఇదే బేనర్లో గద్దలకొండ గణేష్ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. `వేదాంతం రాఘవయ్య` ఈ రోజు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేయగా, స్క్రిప్ట్‌ను రామ్ ఆచంట దర్శకుడు సి చంద్రమోహన్‌కు అందజేశారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తుండగా దాము నర్రవుల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష