కరోనా వ్యాక్సిన్ కు రెడీ అయిన తెలంగాణ
- January 09, 2021
హైదరాబాద్:ఈ నెల 16న వ్యాక్సినేషన్ కు తెలంగాణ రాష్ట్రం సిద్ధం అయింది. 16వ తేదీన తెలంగాణలో 139 సెంటర్లలో వాక్సిన్ జరగనుంది. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 139 సెంటర్లలో మొదటిరోజు 13900 మందికి టీకా వేయనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లు రెండు లక్షల తొంభై వేల మంది వాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ డేట్‌ను మోడీ ప్రభుత్వం అధికారికంగా ఇవాళ ప్రకటించింది. ఇప్పటి వరకు దీనిపై అనేక వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 16వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా టీకా లభిస్తుంది. వీరంతా కలిపి దేశంలో 3 కోట్ల మంది వరకు ఉంటారని కేంద్రం అంచనా వేసింది. మొదట వీరందరికీ కరోనా టీకా వేసిన తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు. 16వ తేదీన రాష్ర్టంలోని రెండు వాక్సిన్ కేంద్రాలతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్ కానున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష