యూఏఈలో వణికిస్తున్న మైనస్ టెంపరేచర్స్..-2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- January 10, 2021
యూఏఈలోని చాలా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అబుధాబి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రక్నా ప్రాంతంలో అయితే..ఏకంగా మైనస్ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున లేచి చూసే సరికి చుట్టుపక్కల ప్రాంతాలన్ని మంచుతో నిండిపోయాయి. ఐసిక్లెస్ ప్రాంతంలో గడ్డి మొక్కలపై ఐస్ పేరుకుపోయిన దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రక్నా ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టం కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్లు జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. తూర్పు నుంచి ఈశాన్యం దిశగా కదులుతున్న చల్లని గాలుల ప్రభావంతో అబుధాబి ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. మంగళవారం నుంచి గాలి దిశలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో రెండ్రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







