హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ షిప్మెంట్
- January 12, 2021
హైదరాబాద్: కోవిడ్-19 వ్యాక్సిన్ల మొదటి విడత షిప్మెంట్ నేడు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోను చేరుకుంది. ఈ వ్యాక్సిన్లు స్పైజ్‌జెట్ ఫ్రైటర్, ఎస్జి 7466 ద్వారా పూణే నుంచి బయలుదేరి ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ కార్గో టెర్మినల్ చేరుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం వాటిని వాటి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.
_1610462535.jpg)
31 బాక్సులతో కూడిన 1 మెగాటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కార్గో ఆప్రాన్ లో నిలిపిన విమానం నుండి ఆఫ్‌లోడ్ చేసి, GHAC టెర్మినల్‌లోని వ్యాక్సిన్ నిల్వ మరియు నిర్వహణ ప్రాంతాలకు చేర్చడం జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్ల కోసం ఏర్పాట్లు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ద్వారా వ్యాక్సిన్‌ను రీఫర్ ట్రక్కుల ద్వారా వాటి కంసైనీ (రాష్ట్ర ప్రభుత్వం)కు తరలించడం జరిగింది.
భారత ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 41 మినీ హబ్‌లలో, దక్షిణ భారతదేశపు పంపిణీ కేంద్రాలలో హైదరాబాద్ ఒకటి.
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఇఒ ప్రదీప్ పణికర్, ‘‘కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో అవసరమైన రిలీఫ్ మెటీరియల్స్‌ను సకాలంలో మరియు సజావుగా సరఫరా చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ యొక్క మొదటి కన్సైన్మెంటు ఈ రోజు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
_1610462543.jpg)
వ్యాక్సిన్ తరలింపు మొత్తం విలువ గొలసులో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) ప్రధాన పాత్రను కలిగి ఉంది. ఇక్కడ రోజుకు 100 మెగాటన్నుల టీకాల కార్గోను నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఈ టెర్మినల్ కూల్ డాలీ, ఎన్విరోటైనర్, వాక్టెక్, మొదలైన ఆధునిక టెంపరేచర్-కంట్రోల్డ్ కూల్ కంటైనర్లను కలిగి ఉంది. కోవిడ్-19 వ్యాక్సిన్ రవాణాను సమర్థంగా నిర్వహించడం అనే ఈ బృహత్కార్యంలో అందరు భాగస్వాములు, ఎగుమతిదారులు, దిగుమతిదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు, సరుకు రవాణా ఫార్వార్డర్లు/ఏజెంట్లు, ప్రభుత్వం, విమానయాన సంస్థలన్నటి ఉమ్మడి సహకారం ఉంది” అన్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







