గోవాలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వేయి శుభములు కలుగు నీకు
- January 12, 2021
గోవా:శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో,జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహ పటేల్ మరియు జామి శ్రీనివాసరావు లు నిర్మిస్తున్న "వేయి శుభములు కలుగు నీకు". ఈ చిత్రం ఇటీవలే గోవా లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ "మా చిత్రానికి అద్భుతమైన టెక్నిషన్స్ పని చేసారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఇటీవలే గోవా లో పాటలు చిత్రీకరించాం" అని తెలిపారు
మరో నిర్మాత జామి శ్రీనివాస రావు మాట్లాడుతూ "వెయ్యి శుభములు కలుగు నీకు సినిమా టాకీ అంత పూర్తి అయ్యింది. ఇటీవలే గోవా లో చివరి షెడ్యూల్ పూర్తిచేసుకున్నాం. ప్రస్తుతం దుబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం " అని తెలిపారు.
దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ "నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా ఇద్దరు నిర్మాతలు తూము నరసింహ పటేల్ గారు మరియు జామి శ్రీనివాస రావు గారికి నా ధన్యవాదాలు. ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మా చిత్రానికి సంగీత దర్శకుడు గ్యాని సింగ్ మంచి పాటలు అందించారు. చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చింది. అందమైన లొకేషన్స్ లో అద్భుతమైన నటి నటులతో మా సినిమా ని చిత్రకరించాం. చిత్రీకరణ పూర్తి అయ్యింది, నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉన్నాము. త్వరలో అద్భుతమైన సినిమా ని ప్రేక్షకుల ముందు కి తీసుకువస్తాము" అని తెలిపారు.
నటి నటులు :
బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
టైటిల్ : వెయ్యి శుభములు కలుగు నీకు
విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్,షాయాజి షిండే,శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిశోరె కుమార్
ఎడిటర్ :వినోద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
నిర్మాత : తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష