క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1000 ఒమన్ రియాల్స్ ఫైన్
- January 13, 2021
ఒమన్ పరిధిలో ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సుప్రీం కమిటీ. కింగ్డమ్ పరిధిలో వైరస్ అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ...అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సయ్యిది హమౌద్ బిన్ ఫైసల్ అల్ బసైది ఆధ్వర్యంలో సమావేశం అయ్యింది. దేశంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల అమలు...వాటి ఫలితాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కమిటీ..కింగ్డమ్ పరిధిలో ఇంకా కొందరు కోవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. అంతేకాదు పౌరులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రవాసీయులు క్వారంటైన్ నిబంధనలు పాటించటంలో తీవ్ర ఉల్లంఘటనలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించుకుంది. కోందరు వ్యక్తులు క్వారంటైన్ ట్రాకింగ్ బ్రాస్లెట్లను తొలగిస్తున్నారని, మరికొందరు క్వారంటైన్ గడువు ముగిసినా బ్రాస్లెట్లను మళ్లీ అధికారులకు అప్పగించటం లేదని, ఇంకొందరు క్వారంటైన్ తర్వాత పీసీఆర్ టెస్టులకు డుమ్మా కొడుతున్నట్లు సుప్రీం కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై 1000 ఒమన్ రియాల్స్ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే..దేశ ప్రజల్లో ఎక్కువ మంది కోవిడ్ నిబంధనలు పాటించటంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, అందుకే కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిందని కమిటీ వివరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష